ప్రస్తుతం తెలుగు సినిమా మీడియా దృష్టి మొత్తం కూడా నాగ చైతన్య మరియు ఆయన చుట్టు జరుగుతున్న ప్రచారం మీద ఉంది.సమంత తో విడి పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు.
ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నాడా.కుటుంబ సభ్యులు ఏమన్నారు అంటూ అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ సమయంలో నాగ చైతన్య మరియు శోభిత దూళ్లిపాళ్ల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది.ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అనేది టాక్.
ఆ టాక్ ఎంత వరకు నిజం అనే విషయాన్ని తెలుసుకునేందుకు తెలుగు మీడియా వారు చేయని ప్రయత్నం లేదు.
అటు నుండి ఇటు నుండి రెండు వైపుల నుండి కూడా మీడియా వారు కూపీ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ సమయంలో నాగ చైతన్య మరియు శోభిత దూళ్లిపాళ్ల ఎక్కడ కలిశారు అనే విషయమై కొందరికి ఒక అవగాహణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.శోభిత మరియు చైతూ కు ఒక కామన్ స్నేహితుడు ఉన్నాడు.
అతడి యొక్క బర్త్ డే పార్టీ సందర్బంగా కొన్నాళ్ల క్రితం వీరిద్దరు కలిశారట.ఆ సమయంలోనే ఇద్దరి మద్య పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత చాలా సార్లు ఇద్దరు మాట్లాడుకోవడం.

ఇద్దరు కూడా పలు విషయాలను షేర్ చేసుకోవడం చేసేవారట.ఆ తర్వాత ఇద్దరి మద్య ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అంటూ కొందరు ఒక కథ నో లేదా నిజమో కాని కథనంను అల్లేశారు.ఆ కథనం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది.అసలు ఈ వ్యవహారం గురించి బయట జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.







