కార్తికేయ 2 ట్రైలర్.. అంచనాలు పెంచేశారు..!

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.ఆ సినిమాకు సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుంది.

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కార్తికేయ 2 సినిమా ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.కృష్ణుడి జన్మస్థలం ద్వారక బ్యాక్ డ్రాప్ లో కార్తికేయ 2 కథ జరుగుతుందని అర్ధమవుతుంది.

సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.

ఇందులో నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది అంటూ వచ్చే డైలాగ్ అదిరిపోయింది.ట్రైలర్ లో వచ్చిన విజివల్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించాయి.

Advertisement

కార్తికేయ 2 ఖచ్చితంగా నిఖిల్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు.ఈ సినిమాను జూలై 22న రిలీజ్ ఫిక్స్ చేశారు.

తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్ లో టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు