గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్దం గా ఉంది.ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
రెండు వారాల ముందు నుండే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పతాక స్థాయికి తీసుకు వెళ్లడం ద్వారా జనాల్లో ఆసక్తిని పెంచాలని భావిస్తున్నారు.అందుకే ఈ సినిమా కు కూడా ప్రమోషన్ ను దర్శకుడు మారుతి మరియు నిర్మాత బన్నీ వాసు అలాగే ప్లాన్ చేశారు.
ఈ సినిమా పై గోపీచంద్ అభిమానులతో పాటు ప్రభాస్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా సక్సెస్ అయితే తప్ప రాజా డీలక్స్ సినిమా పట్టాలు ఎక్కే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
పక్కా కమర్షియల్ సినిమా మినిమం గా అయినా హిట్ అవ్వాల్సి ఉంది.అప్పుడే దర్శకుడు మారుతికి ప్రభాస్ నుండి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీ లో రాజా డీలక్స్ గురించిన చర్చ ప్రధానంగా జరుగుతుంది.ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో గోపీచంద్ మరియు మారుతి ల కాంబో లో రూపొందిన పక్కా కమర్షియల్ సినిమా గురించి చర్చనీయాంశంగా మారింది. రాజా డీలక్స్ సినిమా గురించి ఇటీవలే దర్శకుడు మారుతి స్పందించాడు.
ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్.బుజ్జిగాడు తరహా మాస్ ఎంటర్ టైనర్ ను చేయాలని చాలా కాలంగా ఆసక్తి గా ఎదురు చూస్తున్నాను.
అది ఈ సినిమా తో చేయాలని భావిస్తున్నాను అన్నాడు.మరి మారుతి తో రాజా డీలాక్స్ ను ప్రభాస్ చేసేందుకు ఒప్పుకున్నాడా లేదంటే ఆయన సినిమా లతో బిజీగా ఉన్నాడా అనేది పక్కా కమర్షియల్ రిలీజ్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







