అలా పిల్లల్ని కన్నావా అని అడుగుతున్నారు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు!

స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయికి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా చిన్మయి పాపులారిటీని పెంచుకున్నారు.

 Chinmayi Shocking Comments Viral In Social Media Details, Chinmayi, Singer Chinm-TeluguStop.com

చిన్మయి భర్త తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నటుడిగా, దర్శకుడిగా పాపులర్ అయిన రాహుల్ రవీంద్రన్ అనే సంగతి తెలిసిందే.ఈ ఫేమస్ సింగర్ కవలలకు జన్మనిచ్చింది.

పుట్టిన పిల్లల్లో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి కావడం గమనార్హం.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అమ్మాయిల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే చిన్మయి తాను గర్భవతి అయిన విషయాన్ని అభిమానులకు సైతం వెల్లడించలేదు.

అకస్మాత్తుగా చిన్మయి ఇద్దరు పిల్లలకు తల్లైందని తెలిసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.సరోగసి ద్వారా చిన్మయి పిల్లల్ని కని ఉండవచ్చని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్ల గురించి చిన్మయి ఘాటుగా స్పందించారు.

నేను గర్భవతి అనే విషయం నా సన్నిహితులకు మాత్రమే తెలుసని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా చేశానని చిన్మయి చెప్పుకొచ్చారు.

Telugu Chinmayi, Chinmayi Mother, Chinmayi Twin, Rahul Ravindran, Surrogacy-Movi

పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వెల్లడించడానికి తాను ఇష్టపడనని చిన్మయి తెలిపారు.నా పిల్లల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయనని ఆమె అన్నారు.నెటిజన్ల ప్రశ్నలకు చిన్మయి ఘాటుగా జవాబిచ్చారు.

Telugu Chinmayi, Chinmayi Mother, Chinmayi Twin, Rahul Ravindran, Surrogacy-Movi

చిన్మయి సమాధానంతో ఇకనైనా ఫ్యాన్స్, నెటిజన్లు కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది.చిన్మయి పలు సందర్భాల్లో వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.చాలా సందర్భాల్లో చిన్మయి పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

చిన్మయి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రోజురోజుకు చిన్మయికి సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube