రాష్ట్రపతి అభ్యర్థిగా 'ద్రౌపది ముర్ము' నే ఎందుకు ఎంపిక చేసారంటే ..? 

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి తమ అభ్యర్థిగా  ద్రౌపది ముర్ము ను ఎంపిక చేసింది.మొదటి నుంచి ఈమె పేరునే బిజెపి తరఫున ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.

 All You Need To Know About Bjp Presidential Candidate Draupadi Murmu Details, Pr-TeluguStop.com

దానికి తగ్గట్లుగానే ఫైనల్ అయింది.అంతకుముందు ఉపరాష్ట్రపతి గా ప్రస్తుతం ఉన్న వెంకయ్యనాయుడు ను రాష్ట్రపతి గా ప్రకటిస్తారని అంతా భావించినా, ద్రౌపది ముర్ము ను ఫైనల్ చేశారు.

ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో అధికారికంగా బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం కమిటీలను నియమించారు.అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చివరగా ద్రౌపది ముర్ము ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

అయితే  ఈమె ఎంపిక విషయంలో చాలా రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకుని బిజెపి ఈమె పేరును ఫైనల్ చేసింది.

ఈమె గిరిజన వర్గానికి చెందిన వారు కావడంతో, ఆదివాసీలు బిజెపి పక్షాన భవిష్యత్తులో నిలబడతారని అంచనా వేసి ఈమె ఎంపికను ఫైనల్ చేసినట్లు గా కనిపిస్తున్నారు.

అలాగే ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి ఎటువంటి డోకా లేకుండా పూర్తి చేశారు .విపక్షాలు సైతం ఈమెకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.బిజెపి ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్ సైతం ఆదివాసీల ఓట్ల దృష్ట్యా ఈమెకే మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సంబంధించి దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన తరువాత ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేశారు.

Telugu Bjppresidential, Congress, Droupadi Murmu, Jarkhand, Odissa, Draupadi Mur

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు 64 ఏళ్లు.ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.ఒడిస్సా లో ఎమ్మెల్యేగా గెలవడం తోపాటు మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు.వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే ఈమెనే బీజేపీ వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం తో, ఈమె గెలుపునకు ఎటువంటి డొఖా లేదు అనే విషయం అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube