కన్నడ భామ రష్మిక మందన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ని తన లిస్ట్ లో చేర్చుకుంది.ఇప్పటికే తెలుగులో పుష్ప 2, తమిళంలో దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న హిందీలో ఏకంగా 2 భారీ సినిమాలే చేస్తుంది.
ఈ సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.అర్జున్ రెడ్డి తెలుగులో తీసి అదే సినిమా హిందీలో కూడా రీమేక్ చేసి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరక్టర్ సందీప్ వంగ డైరక్షన్ లో యానిమల్ సినిమా వస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.సినిమాలో ఫీమేల్ లీడ్ గా రష్మికని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు, గుడ్ బై సినిమాల్లో నటిస్తున్న రష్మిక యానిమల్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సందీప్ వంగ సినిమా అంటే హీరోయిన్ కు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది.
ఆ ఛాన్స్ దక్కించుకున్న రష్మిక నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు.ఇప్పటికే పుష్పతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుని నేషనల్ క్రష్ గా మారిన అమ్మడు ఈ సినిమాలతో మరింత ఫాలోయింగ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ఈ సినిమాల తర్వాత రష్మిక స్టార్ రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంది.








