తెలుగు లో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.ఈ షో ఇటీవలే ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.
గత వారంలో ఈ షో కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి విన్నర్గా నిలిచిన వాగ్దేవికి ట్రోఫీతో పాటు 10 లక్షలు క్యాష్ ప్రైజ్ ను అందజేసిన విషయం కూడా తెలిసిందే.అయితే తెలుగు ఇండియన్ ఐడల్ షో ప్రయాణంలో తమన్ నుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.
తాజాగా తమన్ తల్లి సావిత్రి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తమన్ గురించి ఎన్నో విషయాలను తెలిపారు.తమన్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయారని, అందువల్ల చదువుకోలేకపోయాడని, చిన్నతనంలోనే చదువును ఆపేసి పని చేయాల్సి వచ్చిందని, చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన మ్యూజిక్,డ్రమ్స్, వాయిస్తూ డబ్బులు సంపాదించే వాడు అని తన తల్లి చెప్పుకొచ్చింది.
అయితే తమన్ చదువుకో లేకపోయినప్పటికీ చదువు విలువ బాగా తెలియడం వల్ల.

తమన్ తన పాత రోజులను గుర్తు చేసుకొని ఫినాలే ఈవెంట్ రోజు తాను ఇచ్చిన ఒక మాట నిలబెట్టుకున్నాడు.తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సింగర్ రేణుకి ఇచ్చిన మాట ప్రకారం వారికి మూడు సంవత్సరాల పాటు విద్యకు అయ్యే ఖర్చును తాను భరిస్తాను అని తమన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే మాట నిజం చేస్తాను అని తాజాగా ఫినాలే ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు.
అదంతా తాను చేయలేదని తన తో ఆ పని దేవుడు చేయించాలని, తన తల్లి అలా చెప్పేసిందని తమన్ ఎంతో డౌన్ టు ఎర్త్ గా మాట్లాడేసాడు.