పెరుగుతున్న టెక్నాలజీని కొంతమంది తప్పుడు తోవలో వాడుకుంటున్నారు.స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తరువాత అనేక యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి.
మనిషి అవసరాలను పసిగట్టి యాప్స్ ని అడ్డంపెట్టుకొని సైబర్ నేరస్తులు పెచ్చుమీరిపోతున్నారు.ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొనే రెండు సంవత్సరాలనుండి భారత కేంద్ర ప్రభుత్వం పదుల సంఖ్యలో యాప్స్ ని తొలగిస్తోంది.
తాజాగా ఓ 10 యాప్స్ ని టార్గెట్ చేసింది మన కేంద్రం.మీ ఫోన్లలో ఈ 10 యాప్స్ లో ఏవైనా ఉంటే తక్షణమే డిలీట్ చేస్తే మంచింది.
లేదంటే మూల్యం చెల్లించుకుంటారు.
ఈ యాప్స్ వినియోగదారుల ఫోన్ నుండి సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అందువలనే ఈ పది ఆండ్రాయిడ్ యాప్స్ ని గూగుల్ ఇటీవల ప్లే స్టోర్ నుండి డిలీట్ చేసేసింది.అందుకే, ఈ పది యాప్స్ లో ఏవైనా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించడం ఉత్తమం.
ఈ 10 యాప్స్ లో కొన్ని 10 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్ లోడ్స్, అంటే 1 కోటి కంటే ఎక్కువ డౌన్ లోడ్స్ చెయ్యబడిన యాప్స్ కూడా వున్నాయి.అలాగని ఇవ్వి ఉత్తమమైనవి కాదు అని గుర్తు పెట్టుకోండి.
ఇక Google నిషేధించిన యాప్స్ జాబితాలో QR కోడ్ డిటెక్టర్, వాతావరణ విడ్జెట్ మరియు ముస్లిం ప్రార్థన సమయాల కోసం ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి.
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉన్న డజన్ల కొద్ధి యాప్స్ లో హానికరమైన కోడ్ ఉన్నట్లు సెర్జ్ ఎగెల్‌మాన్ మరియు జోయెల్ రియర్డన్ అనే ఇద్దరు సెక్యూరిటీ మరియు ప్రైవసీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.
ఈ కోడ్స్ ద్వారా వినియోగదారు యొక్క ఖచ్చితమైన అడ్రస్, ఇమెయిల్, ఫోన్ నంబర్స్ వంటివి వారు ఈజీగా కనుగొంటున్నారు.అందుకే, గూగుల్ ఈ విధమైన కోడ్స్ కలిగిన వాటిని గుర్తించి వెంటనే తొలగిస్తుంది.
ప్రస్తుతం ఆ లిస్టులో ఈ 10 యాప్స్ వున్నాయి.
1.
QR & Barcode Scanner (Developed by AppSource Hub)
2.Speed Radar Camera
3.Wi-Fi Mouse (Remote Control PC)
4.Qibla Compass – Ramadan 2022
5.
Simple Weather & Clock Widget (Developed by Difer)
6.Al-Moazin Lite (Prayer times)
7.
Handcent Next SMS- Text With MMS
8.Smart kit 360
9.Audiosdroid Audio Studio DAW
10.Full Quran MP3-50 Languages & Translation Audio







