పూజా హెగ్డే అనవసరపు ఖర్చులు.. నీ బిల్లులు నువ్వే కట్టుకో అంటూ నిర్మాణ సంస్ద షాక్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తెలుగు, తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

 Pooja Hegde Unnecessary Expenses Construction Company Given Shock By Saying Pay-TeluguStop.com

ఈమె నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినప్పటికీ.చాలా వరకు ప్లాప్ అయ్యాయి.

అయినా కూడా కూడా ఈ అమ్మడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

కానీ అటు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస సినిమాలు అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఒక సినిమా కోసం పూజా హెగ్డే చేసిన ఖర్చులు భరించలేక నిర్మాతలు ఆమెకి బిల్లు పంపి కట్టమని చెప్పినట్టు సమాచారం.అసలు విషయానికి వస్తే పూజా ఒక్కో సినిమాకి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

అంతే కాకుండా ఈ బ్యూటీ షూటింగ్ లో పాల్గొనే సమయంలో ఈమెతో పాటు ఈమె స్టాఫ్ కి సంభందించిన ఖర్చులు కూడా నిర్మాణ సంస్థ వారు భరించాల్సిందే.ఇటీవల తమిళ హీరో విజయ్ తో కలసి బీస్ట్ సినిమాలో నటించింది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో నిర్మాతలు కూడా కొంతవరకు నష్టపోయినట్లు సమాచారం.

Telugu Expenses, Pooja Hegde, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజాహెగ్డే తన స్టాఫ్ తో కలిసి కేవలం తిండి కోసం మాత్రమే లక్షలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా వల్ల నష్టాల పాలైన నిర్మాతలు పూజా హెగ్డే చేసిన ఖర్చులను భరించలేక పోయారు.అందువల్ల ఆమె తన స్టాఫ్ తో కలిసి చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆమెకి పంపి వాటిని కట్టమని చెప్పారట.ఈ విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube