ప్రముఖ బాలీవుడ్ నటి పరిణితి చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు అయిన పరిణితి చోప్రా తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
‘లేడీస్ వర్సెస్ రిక్కీబెల్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
పరిణితి చోప్రా బాలీవుడ్ లో అర్జున్ కపూర్ సరసన నటించిన ‘ఇషక్‌జాదే’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ బ్యూటీ మరింత పాపులర్ అయ్యింది.ఈ సినిమా హిట్ అవటంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి.
పరిణీతి చోప్రా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ నిత్యం బిజీగా ఉంటోంది.ఇలా వరుస షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
తన అందమైన ఫోటోలతో పాటు తనకి సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల స్కూబా డైవింగ్ చేసిన పరిణీతి.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఈ వీడియోలో పరిణితి చోప్రా చేసిన ఒక మంచి పని మనకు కనిపిస్తుంది.స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలో ఉన్న చెత్తను సేకరించింది.
ఈ సందర్భంగా పరిణితి చోప్రా మాట్లాడుతూ.సరదాగా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశాను.
ఆ సమయంలో సముద్రంలో ఉన్న చెత్తని కూడా సేకరించి ఒక మంచి పని చేశాను అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా పరిణితి చోప్రా సముద్రాన్ని శుభ్రం చేసేందుకు నాతో చేరండి అంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చింది.పరిణితి చోప్రా షేర్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్ల నుండి భారీగా స్పందన వస్తోంది.చాలా గొప్ప పని చేశారు అంటూ కొందరు నెటిజన్లు మెచ్చుకోగా.
మీ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో అవగాహన కల్పించాలని మరికొంతమంది కోరారు.పరిణితి చోప్రా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మీ లాగా అందరు ఇలా సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం చాలా అవసరం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







