పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా హరి హర వీరమల్లు.పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో తర్జన భర్జన జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం టైం కేటాయించడానికి కుదరడం లేదన్ టాక్.చిత్రయూనిట్ అంతా పవన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.
అయితే పవన్ మాత్రం క్రిష్ కు ఆగష్టు కి డెడ్ లైన్ పెట్టేశాడట. ఈలోగా హరి హర వీరమల్లు సినిమా తన పోర్షన్ కంప్లీట్ చేయమని చెప్పాడట.
క్రిష్ కూడా ముందు పవన్ కు సంబందించిన పార్ట్ ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట.
ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా నటిస్తుంది.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
పవన్ చెప్పినట్టుగా క్రిష్ ఆగష్టు కల్లా సినిమా పూర్తి చేస్తాడా లేక ఇంకా పెండింగ్ పెడతాడా అన్నది చూడాలి.డైరక్టర్ క్రిష్ ఇదివరకు తన సినిమాలన్ని చాలా త్వరగా పూర్తి చేశాడు.
హరి హర వీరమల్లు సినిమానే అనుకున్న టైం కి పూర్తి చేయలేకపోతున్నాడు.







