సీఎం కేసీఆర్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలతో అందరూ అలెర్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం కూడా ఉండటంతో పలువురు టీఆర్ఎస్ నేతలు సొంతంగా సర్వేలు చేయించుకోవడంలో బిజీగా ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో కూడా మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయన్న వార్తలతో ఎమ్మెల్యేలే కాకుండా కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారు కూడా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.అయితే కేసీఆర్ ఎన్నికల వ్యూహ రచన బాధ్యతను ప్రశాంత్ కిశోర్ కి అప్పగించడంతో ఆయన ఇప్పటికే తన బృందాలతో మూడుసార్లు నియోజకవర్గాల్లో సర్వే చేయించి రిపోర్టు కూడా అందించారని తెలుస్తోంది.
అయితే ముందస్తు ఎన్నికల జరుగుతాయన్న ప్రచారంపై పలు సార్లు స్పందించిన కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని చెప్పినప్పటికీ పీకే టీమ్ తో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తున్నారు.ఇక తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ జిల్లా నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు.అందరు కలిసి పనిచేయాలని రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు.దీంతో మరింత ఊపు అందుకుంది.అయితే పీకే నివేదిక ప్రకారం వీక్ గా ఉన్న నేతలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ని మంత్రివర్గంలోని సగం మంది ఎమ్మెల్యేల్లో 60 నుంచి 70 శాతం మంది ప్రజల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పీకే నివేదిక సమర్పించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గగాలను వదిలి బయటకు రావడంలేదని తెలుస్తోంది.మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పలు సర్వే సంస్థలను సంప్రదించి తమ తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది.ఎమ్మెల్యేలు సర్వే ఏజెన్సీలతోనే కాకుండా గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలకు చెందిన తమ సన్నిహితులను పంపించి సమాచారం సేకరిస్తున్నారని సమాచారం.
అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో ఆశావహులు కూడా పలు సంస్థలతో సర్వేలు చుయించుకుంటున్నారు.ఏ పార్టీకి అనుకూలంగా ఉంది.ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే ప్లస్ అవుతుందనే ఆలచోనలో ఉన్నట్లు తెలుస్తోంది.







