అఖండ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు డైరక్టర్ బోయపాటి శ్రీను.ప్రస్తుతం రామ్ లింగుసామి డైరక్షన్ లో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా పూర్తి కాగానే బోయపాటి మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.రామ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమాలో బాలయ్య బాబు కూడా ఉంటాడని తెలుస్తుంది.
అదేంటి బోయపాటి శ్రీను మల్టీస్టారర్ ఏదైనా చేస్తున్నాడా లేక రామ్ సినిమాలో బాలయ్య కెమియో ఉంటుందా అంటే సినిమాలో బాలకృష్ణ ఉండడు కాని ఆయన రిఫరెన్స్ మాత్రం ఉంటుందని అంటున్నారు.
రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలో జై బాలయ్య అనే రిఫరెన్స్ వాడుతున్నారని తెలుస్తుంది.
బోయపాటి తన సినిమాలో బాలయ్య రిఫరెన్స్ వాడి నందమూరి ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు.రామ్ ది వారియర్ సినిమా ఆల్రెడీ పూర్తి చేసుకుంది త్వరలోనే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
బోయపాటి మార్క్ యాక్షన్ మూవీగా రామ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమాపై రామ్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది.








