రేవంత్ రెడ్డిని ఘట్కేసర్ టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కి తరలింపు.నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల కాల్పుల్లో మరణించిన నర్సంపేట దామొరకి చెందిన యువకుడు రాకేష్.
రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరిన టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్లకుండా ఘట్కేసర్ టోల్ గేట్ వద్ద అడ్డగించిన ఏసీపీ శ్యామ్ సుందర్, 10 మంది సీఐలు, ఘట్కేసర్ పోలీసు స్టేషన్ కి తరలింపు.
ఏసీపీ శ్యామసుందర్ తో వాగ్వాదానికి దిగిన రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డికీ సంఘీభావంగా ఘట్కేసర్ బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.







