ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.కేవలం సౌత్ లో పాపులర్ అయినప్పుడే అల్లు అర్జున్ ఫుల్ క్రేజ్ ఉండేది.
ఇక ఇప్పుడు నార్త్ లో కూడా అల్లు అర్జున్ క్రేజ్ ఏర్పరుచుకోవడంతో ఈయనను మిగతా స్టార్ హీరోలు అందుకోలేక పోతున్నారు.ప్రతి సెలెబ్రిటీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది.
అయితే కొంత మందికి మాత్రం అంత భారీ లెవల్ లో ఫాలోవర్స్ లేరు.
మరి మన టాలీవుడ్ లో ఏ హీరోకు లేని భారీ క్రేజ్ అల్లు అర్జున్ కి సొంతం.
ఈయనకు పుష్ప సినిమా తర్వాత మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ప్రెసెంట్ అల్లు అర్జున్ కు 18.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.కేవలం కొద్దీ రోజుల్లోనే ఈయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు 20 మిలియన్ ఫాలోవర్స్ కు కూడా కొద్దీ కాలంలోనే చేరుకునే అవకాశం ఉంది.

ఇక ఈయన సినిమా విషయానికి వస్తే.ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులను తిరగ రాసింది.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.
ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు.ఈ సినిమా జులై చివరి వారం నుండి షూట్ స్టార్ట్ చేయబోతున్నారని టాక్.
ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా ఎదురు చూస్తున్నారు.







