భారీ బ్యాక్గ్రౌండ్.భారీ కటౌట్.
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే యాక్టింగ్ టాలెంట్.అయినా అతను ఎందులో స్టార్ కాలేకపోతున్నాడు అన్నది ఇప్పటికీ అభిమానులకు ఒక ప్రశ్న.
ఆ ఎవరో కాదు దగ్గుబాటి వారసుడు రానా. రానా తన కెరీర్ లో ఎన్నో మంచి కథలను ఎంచుకుని తనలోని నటుడిని తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు ప్రూవ్ చేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత ఏ కథలు ఎంచుకోవాలో తెలియ లేదేమో కొన్ని పిచ్చిపిచ్చి కథలతో చివరికి తన స్టార్ డమ్ తానే తగ్గించుకున్నాడు.కృష్ణం వందే జగద్గురం, ఘాజీ లాంటి సినిమాలతో రానాకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.
రానా కెరియర్ లోనే ఆయన ఎంచుకున్న మంచి కథ ఏది అంటే అది బాహుబలి అని చెప్పాలి.వరల్డ్ వైడ్ గా బల్లాల దేవుడిగా రానాకు గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఇక బాహుబలితో ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత కెరియర్ను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకోవాల్సిన రానా మళ్లీ అదే చిన్న చిన్న కథల బాట పట్టాడు.అయినా రానాకు ఏం తక్కువ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది.
రానా అభిమానులతో పాటు బాబాయ్ అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తారు.ఆరడుగుల దేహం.
యాక్షన్ సన్నివేశాల్లో ఇరగ తీయగలడు.కానీ కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయడం లేదు అని ఎప్పటినుంచో రానా అభిమానులు అడుగుతున్న ప్రశ్న.
చివరికి రానా తన కెరీర్ విషయంలో రియలైజ్ అయ్యాడా అంటే ఇటీవలే మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే రియలైజ్ అయ్యాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది.

ఎందుకు అంటారా ఇటీవలే విరాటపర్వం సినిమాలో హీరో సాయి పల్లవి అని చెబుతున్నాడు రానా.మరి రానా పాత్ర ఏమిటి? దీంతో ఇక ఇటీవల విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎప్పుడూ ఇలాంటి సినిమాలేనా అని అభిమానులు అడుగుతున్నారు.ఇకనుంచి ఇలాంటి సినిమాలు చేయను.
ప్రయోగాలకు ఈ సినిమాతో చెక్ పెట్టేస్తాను అంటూ రానా చెప్పాడు.రానా మాటలను బట్టి చూస్తే ఇక కెరీర్ లో ఏం చేయాలన్నది రియలైజ్ అయ్యాడు అని తెలుస్తుంది.
అదే సమయంలో విరాట పర్వం సినిమా ఎందుకు చేసానా అని అంతర్మథనం కూడా చెందుతున్నాడు అని టాక్ కూడా వినిపిస్తోంది.రానున్న రోజుల్లో రానా సినిమా సెలక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.