కరోనా మహమ్మారి అమెరికాలో అడుగిడిన సమయం మొదలు నేటి వరకూ ఎలాంటి భయానక పరిస్థితులను సృష్టించిందో అందరికి తెలిసిందే.ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందుగానే పసిగట్టిన ఆదేశ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ప్రజలపై కరోనా విరుచుకు పడుతుందని ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతుందని ముందుగానే ట్రంప్ ని హెచ్చరించారు.
ఆ తరువాత కరోనా ప్రభావం తీవ్రతరమవడంతో ఈ వ్యాధిని నియంత్రించే కమిటీలో ఫౌచీ కి కీలక భాద్యతలు అప్పగించారు ట్రంప్.దాంతో.
అమెరికాలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని, చేతులు ఎలా సుబ్రపరుచుకోవాలి అంటూ క్లాస్ లు కూడా తీసుకున్నారు.ప్రపంచానికి సందేశం కూడా ఇచ్చారు.వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చే వరకూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటిస్తూ మాస్క్ ధరించి, చేతులు శుబ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అయితే ఊహించని విధంగా ఫౌచీ కరోనా బారిన పడటంతో అందరూ షాక్ కి గురయ్యారు.
అప్పట్లో ఫౌచీ పై ఫన్నీ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి.ఆ తరువాత బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత/

ఫౌచీ వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాలంటూ ప్రచారం చేసారు.రెండు వ్యాక్సిన్ లు చేయించుకుంటే కరోనా దరిచేరదని ప్రకటించారు, కానీ ఊహించని విధంగా రెండు వ్యాక్సిన్ లు వేసుకున్న వారిపై కూడా కరోనా ప్రభావంక్ చూపడంతో బూస్టర్ డోస్ వేసుకోవలంటూ మరో కీలక ప్రకటన చేసారు ఫౌచీ.కరోనా వ్యాధి రూపం మార్చుకుంటున్న తరుణంలో బూస్టర్ డోస్ ద్వారా మనం ప్రాణాలు కాపాడుకోవచ్చునని ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఫౌచీ రెండు సార్లు బూస్టర్ డోస్ తీసుకున్నారు.కానీ తాజాగా పౌచీ కరోనా లక్షణాలతో ఇబ్బంది పడటంతో ఆయన సిబ్బంది పరీక్షలు నిర్వహించగా ఆయనకు మళ్ళీ కరోన సోకిందని తెలుసుకుని షాక్ అయ్యారు.
దాంతో ఫౌచీ పై మరో సారి ట్రోల్స్ వర్షం కురుస్తోంది.అమెరికా విధించిన నిభంధనల ప్రకారం ఎన్ని వ్యాక్సిన్ లు చేయించుకోవాలో అన్నీ చేసుకున్న పౌచీ మళ్ళీ కరోనా బారిన పడ్డారంటూ కామెంట్స్ చేస్తున్నారు.







