ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్, యావరేజ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి.
చాలామంది స్టార్ హీరోలు హిట్ టాక్ తో సినిమాల బ్రేక్ ఈవెన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొన్ని సినిమాల విషయంలో ఫ్లాప్ టాక్ తో ఎన్టీఆర్ రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోని డిజాస్టర్లలో ఆంధ్రావాలా సినిమా కూడా ఒకటి.
సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమా నిర్మాత మాత్రం ఆంధ్రావాలా తనకు మంచి లాభాలను మిగిల్చిందని వెల్లడించడం గమనార్హం.
తారక్ కెరీర్ లో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో అల్లరి రాముడు సినిమా ఒకటి.ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

కంత్రి, నాగ, రామయ్యా వస్తావయ్యా సినిమాలు కూడా నిర్మాతలకు కమర్షియల్ గా లాభాలను అందించాయి.ఎన్టీఆర్ సినిమాలలో చాలా సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కడం తారక్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడంతో నిర్మాతలకు మంచి లాభాలను వచ్చాయి.పాన్ ఇండియా హీరోగా క్రేజ్ ఉన్నా తారక్ ఇప్పటికీ తన సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కేలా జాగ్రత్త పడుతున్నారు.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ కూడా 150 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం.ఎన్టీఆర్ బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతుండటంతో నిర్మాతలకు నష్టాలు తగ్గుతున్నాయి.తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందేమో చూడాల్సి ఉంది.







