వైసీపీ ప్రభుత్వంలో రెండు నెలల కిందట దాదాపుగా 70 శాతం మంత్రులు మారిపోయారు.దాదాపు 11 మంది కీలక మంత్రులను సీఎం జగన్ పక్కన పెట్టారు.
అయితే పదవులు పోయిన వాళ్లు మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేయకుండా గంభీరాలు పోయారు.తమకు పదవులు శాశ్వతం కాదని.
ప్రజలే శాశ్వతం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు.కానీ మాజీ మంత్రుల్లో చాలా మంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
కనీసం మీడియా ముందుకు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.ముఖ్యంగా తమకు పదవులతో సంబంధం లేదని చెప్పిన నేతల జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మాజీ హోంమంత్రి సుచరిత, పేర్ని నాని, కన్నబాబు, ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్ వంటి వాళ్లు ఉన్నారు.
పదవులు పోయిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించినా.ఆయా నేతలు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది.
పుష్పశ్రీవాణి పార్టీ వ్యవహారాల్లో కాకుండా సొంత వ్యవహారాల్లో బిజీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.ఆమె గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు కూడా కనిపించడం లేదని స్వయంగా వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు.
మిగతా మాజీ మంత్రుల్లో కూడా కొందరు ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని… పార్టీలో జోష్ నింపే పనికూడా చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారంలో ఉన్నప్పుడూ తమను పట్టించుకోలేదని.
ఇప్పుడు కూడా తమకు దూరంగా ఉంటున్నారని వైసీపీ క్యాడర్ ఆరోపిస్తోంది.అయితే కొంతమంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో మిగతా నేతలతో కలియతిరుగుతున్నారు.అధిష్టానం కనుసన్నల్లో పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

మరోవైపు వైసీపీలో వర్గ విభేదాలు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. గన్నవరం, మచిలీపట్నం, కాకినాడ, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో సొంత పార్టీ నేతల్లో విభేదాలు రచ్చకెక్కడంతో అధిష్టానం సీరియస్‌గా వ్యవహరిస్తోంది.తాజాగా కర్నూలు మండలం గార్గేపురంలో ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జి కోట్ల హర్ష వర్గాల మధ్య పోరు బహిర్గతమైంది.దీంతో సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీల నేతలపై పెట్టిన దృష్టి సొంత పార్టీ నేతలపైనా పెడితే బాగుంటుందని పలువురు సూచిస్తు్న్నారు.







