కన్నతల్లి విగ్రహానికి పూజలు చేస్తున్న కొడుకు!

తండ్రికి కుమార్తెలకు ఎంత అనుబంధం ఉంటుందో అదే తరహాలో తల్లికి కొడుకు కూడా ఉంటుంది.సాధారణంగా అబ్బాయిలు తమ తల్లి చెంత బిడ్డగా పెరుగుతారు.

 Son Worshiping Mother Idol , Mother, Statue, Viral Social Media , Pooja , Son Wo-TeluguStop.com

అయితే ఎంతో ప్రాణంలా భావించే తల్లి చనిపోతే ఏ కొడుకూ తట్టుకోలేడు.ఇదే తరహాలో ఓ కొడుకు చనిపోయిన తన తల్లిని తలచుకుని కుంగిపోయాడు.

చివరికి తల్లి లేకుండా బతకలేనని అతడికి అర్థం అయింది.దీంతో తన తల్లి ఎప్పుడూ తన కళ్ల ముందే ఉండాలని భావించాడు.

అనుకున్నదే తడవుగా తన ప్లాన్ అమలు చేశాడు.అచ్చు గుద్దినట్లు తన తల్లిని పోలి ఉండే మైనపు విగ్రహాన్ని చేయించాడు.

దానిని ఇంట్లో ప్రతిష్టించాడు.రోజూ ఆ విగ్రహానికి పూజలు చేసి, తల్లి పట్ల తన ప్రేమను చాటుకుంటున్నాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఒక కుమారుడు తన ఇంట్లో మరణించిన తల్లిని పంచలోహ విగ్రహంగా తయారు చేయించుకున్నాడు.

కర్నాటకలోని గదగ్ జిల్లా గగేంద్రగడ తాలూకాలోని లక్కలకట్టి గ్రామానికి చెందిన దేవన్న ఒక లెక్చరర్.ఆయన తల్లి శివగంగమ్మ వృద్ధాప్య అనారోగ్యంతో గత ఏడాది తన 90వ ఏట మరణించారు.

ఒక లెక్చరర్ అయినప్పటికీ, ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్పేవాడైనా తన తల్లి విషయంలో దేవన్న చిన్న పిల్లాడిలా మారిపోయాడు.తన తల్లి మరణించిన తర్వాత చాలా రోజులు నిరాశకు గురయ్యాడు.

ఆమెను అస్సలు మరిచిపోలేక పోయాడు.ఆమె జ్ఞాపకార్థం విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు.బెంగళూరుకు చెందిన మురళీధర్ ఆచార్య రూపొందించిన ఫైబర్ విగ్రహానికి సుమారు రూ.3 లక్షలు, హొన్నప్ప ఆచార్య రూపొందించిన పంచలోహ విగ్రహానికి మరో రూ.95 వేలు వెచ్చించారు.వాటిని ఇంట్లోనే ప్రతిష్టించారు.

వాటికి పూజలు చేస్తూ, తల్లి తనతోనే ఉందనే అనుభూతికి లోనవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube