సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత తన 28వ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.జూలై లో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీ తర్వాత మహేష్ 29వ సినిమా రాజమౌళి డైరక్షన్ లో ఉంటుందని తెలిసిందే.ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో మహేష్ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 30వ సినిమా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది.మహేష్ ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయాలని ఫిక్స్ అయ్యారట.
ఇందుకు సంబందించిన అడ్వాన్స్ కూడా తీసుకున్నారని తెలుస్తుంది.మహేష్ 30వ సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమాకి డైరెక్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.అయితే ఇద్దరు దర్శకుల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి.
అందులో ఒకరు కొరటాల శివ కాగా.మరొకరు అనీల్ రావిపుడి అని తెలుస్తుంది.
ఈ ఇద్దరులో ఒకరు మహేష్ 30వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.







