దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా వెలుగొందిన నయనతార ఎట్టకేలకు జూన్ 9వ తేదీ మహాబలిపురంలో ఎంతో ఘనంగా తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరి పెళ్లి ఎంతో మంది అతిథులు సమక్షంలో ఘనంగా జరిగింది.
ఇక వీరి వివాహానికి ఎంతో మంది స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే నయనతార కో స్టార్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ముంబై నుంచి నయనతార పెళ్లి కోసం మహాబలిపురం చేరుకున్నారు.
ఇలా నయనతార పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన షారుక్ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు.
నయనతార పెళ్లికి షారుఖాన్ వస్తే తనని ట్రోలింగ్ చేయడం ఎందుకు అనే విషయానికి వస్తే… షారుక్ ఖాన్ గత నెల 25వ తేదీ ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.అయితే షారుక్ ఖాన్ కూడా కరోనా బారిన పడ్డారనే విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా కరోనా బారినపడ్డ షారుక్ ఖాన్ ఇలా వందల మంది పాల్గొన్న వివాహానికి రావడం ఏంటి అంటూ పెద్దఎత్తున ఈయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక స్టార్ సెలబ్రిటీ అయిండు ఏ మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున షారుక్ ఖాన్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయంపై స్పందించిన షారుక్ అభిమానులు ఆయన కేవలం స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడ్డారని,ఆ లక్షణాలన్నీ పూర్తిగా నయం అయిన తరువాత డాక్టర్ల సూచన మేరకే అతను ఈ వివాహానికి హాజరయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే నయనతార తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నయనతార కో స్టార్ గా షారుక్ ఖాన్ పెళ్ళికి హాజరై పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.







