తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న "ఏనుగు"

చిన్నప్పటి నుండి సినిమా పై ఉన్న ప్యాషన్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే కోరికతో ఉత్తరాంధ్ర లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమాలపై అవగాహన పెంచుకుని నిర్మాణ రంగంలోకి దిగి హీరో ధనుష్ తో ధర్మయోగి సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయం అందుకొన్నాడు నిర్మాత సి.హెచ్ సతీష్ కుమార్.

 Arun Vijay Starrer Enugu To Arrive At Cinemas On June 17 , Arun Vijay, Priya Bha-TeluguStop.com

ఆ తర్వాత బూమారంగ్, లోకల్ బాయ్స్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుని ఇప్పుడు తన సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించిన తమిళ “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నారు.హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి.ఈ సినిమా దర్శకత్వం వహించడం విశేషం.ఈ చిత్రంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా

చిత్ర నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.

సింగం సిరీస్ లతో పోలీస్ అంటే ఇలా ఉంటాడా అని తెలుగు ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ ను పరిచయం చేసిన దర్శకుడు హరి.మళ్ళీ అయన దర్శకత్వంలో “ఏనుగు” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము.ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.ఈ సినిమాలో సముద్రఖని, KGF రామచంద్ర రాజు, రాధిక శరత్‌కుమార్ వంటి ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ తో ఇందులో నటిస్తుండడం విశేషం.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రి రిలీజ్ ను ఈ నెల 12 న జరుపుకొని ఇదే నెల 17 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తన్నాము.మంచి కంటెంట్ తో ఫస్ట్ లైన్ ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube