కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ మెల్లి మెల్లిగా గాడి లో పడుతోంది.ఒకప్పుడు ఓవర్సీస్ లో తెలుగు సినిమా ల వసూళ్లు బాలీవుడ్ సినిమా లను మించి ఉండేవి.
అక్కడ చిన్న హీరోల సినిమా లు కూడా మిలియన్ మార్క్ ను సొంతం చేసుకున్నాయి.ఎన్నో మిలియన్ డాలర్ల సినిమా లను తెలుగు ప్రేక్షకులు అక్కడ సూపర్ హిట్ చేశారు.
కాని కరోనా వల్ల పెద్ద హీరోలు నటించిన సినిమా లు కూడా ఓవర్సీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి.మళ్లీ మెల్ల మెల్లగా అక్కడ కూడా పరిస్థితులు కుదుట పడుతున్నాయి.
ఇటీవల విడుదల అయిన మేజర్ సినిమా మిలియన్ మార్క్ ను చేరుకుని అమెరికాలో తెలుగు సినిమా యొక్క సత్తా చాటింది.అంతకు ముందు వారం వచ్చిన ఎఫ్ 3 సినిమా కూడా అమెరికాలో మంచి వసూళ్లను దక్కించుకుంది.
అక్కడ ఎఫ్ 3 సాధించిన వసూళ్లు భారీగానే ఉన్నాయి.అంతకు ముందు సర్కారు వారి పాట అంతకు ముందు మరి కొన్ని సినిమాలు కూడా మిలియన్ మార్క్ ను చాలా ఈజీగా నే దక్కించుకున్నాయి.
వరుసగా మూడు వారాలు విడుదల అయిన సినిమా లో అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కించుకోబోతున్నాయి.ఈ వారంలో విడుదల కాబోతున్న అంటే సుందరానికి సినిమా ఓవర్సీస్ లో భారీ గా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
కనుక ఖచ్చితంగా అక్కడ మిలియన్ మార్క్ తో అంటే సుందరానికి హ్యాట్రిక్ దక్కించుకుంటుందేమో చూడాలి.తెలుగు లో వస్తున్న సినిమా లు బ్యాక్ టు బ్యాక్ అక్కడ విజయాలను దక్కించుకుంటున్నాయి.
నాని అంటే సుందరానికి సినిమా లో నాజ్రియా హీరోయిన్ గా నటించింది.సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.
కనుక US లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.