ఇరాక్‌లోని టైగ్రిస్ నది ఎండిపోయాక అక్కడ 3,400 సంవత్సరాల నాటి పురాతన నగరం బయటపడింది.పురావస్తు శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో పాత నగరాన్ని కనుగొంది.
కరువు కారణంగా ఈ ప్రాంతంలోని టైగ్రిస్ నదిలో నీటి నిల్వలు లేవు.నీరు అడుగంటి పోవడంతో కాంస్య యుగం నాటి నగరం బయపడింది.
ఈ నగరం క్రీ.పూ.1475 నుంచి క్రీ.పూ.1275 మధ్య కాలం నాటిదని తెలుస్తోంది.ఉత్తర యూఫ్రేట్స్-టైగ్రిస్ ప్రాంతాన్ని మితన్నీ సామ్రాజ్యం పాలించినప్పుడు నిర్మించబడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జర్మన్, కుర్దిష్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం ఈ పురాతన నగరం బయటపడిన మోసుల్ రిజర్వాయర్‌కు చేరుకున్నారు.వారు 100 పురాతన మట్టి పలకలను కనుగొన్నారు.తదుపరి పరిశోధనలో ఒక రాజభవనం, బహుళ-అంతస్తుల భవనాలు, అనేక టవర్లు, పెద్ద నిర్మాణాలతో కూడిన మట్టి ఇటుకలతో కూడిన గోడ స్థావరం కనుగొనబడింది.ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం నిపుణులు దీనిని కాంస్య యుగంలో మిట్టని సామ్రాజ్య యుగం నాటిది అని పేర్కొన్నారు.
ఇది జాఖికు పురాతన పట్టణానికి ప్రాతినిధ్యం వహించి ఉండవచ్చని భావిస్తున్నారు.క్రీ.పూ.1350 ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల జఖికూ పూర్తిగా నాశనమైంది.అక్కడ నగరం నిర్మాణ శైలి చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.క్రీ.పూ.3400 ఏళ్ల క్రితమే వారి ఇళ్లు అద్భుతంగా నిర్మించుకున్నారు.వాటిని చూసిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం కూడా ఆశ్చర్యపోయింది.పూర్వం నదుల చెంత అంతా నివసించే వారు.అక్కడి నీటిని తాగునీటిగా, సాగునీటిగా ఉపయోగించుకునే వారు.చాలా వరకు చరిత్రలో ఎక్కువ జాతులు ఇలా నది ఒడ్డునే నివసించినట్లు తేలింది.
వీరు కూడా ఇలాగే తమ నగరాన్ని టైగ్రిస్ నది ఒడ్డున నిర్మించుకున్నారు.ఓ సారి భారీ వరద వచ్చి, వీరు నివసిస్తున్న నగరం నీటి కిందకు వెళ్లిపోయిందని, ఇన్నాళ్లకు నదిలో నీళ్లు లేకపోవడంతో ఆ నగరం బయటపడిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.







