ఐఆర్‌సీటీసీ యూజర్లకు గుడ్ న్యూస్.. రెట్టింపు రైలు టికెట్లు బుకింగ్!

మీరు రైలు ప్రయాణాలు చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్.ఇప్పటికే చాలా మంది ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని, తమ ప్రయాణాలను చేస్తుంటారు.

 Good News For Irctc Users Double Train Ticket Booking , Irctc, Online, Passeng-TeluguStop.com

అయితే ఒక్కోసారి టికెట్లు బుక్ అవడంలో ఇబ్బందులు ఉంటాయి.ఎందుకో అర్థం కాక తల పట్టుకుంటారు.

ఇక మీకు అలాంటి చింత అవసరం లేదు.ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుకింగ్ పరిమితి రెట్టింపు అయింది.

దీనిపై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

భారతీయ రైళ్లలో ప్రయాణించే వారు ఒక్కో ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల పరిమితిని రెట్టింపు చేశారు.దీనిని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ రెండింటి ద్వారా చేయవచ్చు.

ఇప్పటి వరకు ఆధార్ లింక్ చేయని యూజర్లు కేవలం నెలకు గరిష్టంగా 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.వీరికి పరిమితిని 12 టికెట్ల వరకు నెలలో బుక్ చేసుకునే సౌలభ్యాన్ని తాజాగా కల్పించారు.

ఇక ఐఆర్‌సీటీసీ యాప్ వినియోగించే వాళ్లలో చాలా మంది ఆధార్ లింక్ చేసుకున్నారు.వారికి ఇప్పటి వరకు నెలకు గరిష్టంగా 12 టికెట్లు మాత్రమే రిజర్వేషన్ చేయించుకోగల పరిమితి ఉండేది.

వారికి తాజా ప్రకటనతో మెరుగైన సౌలభ్యం కల్పించారు.యాప్‌లో ఆధార్ లింక్ చేసిన వ్యక్తులు ఇక నుంచి నెలకు గరిష్టంగా 24 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ఓ షరతు ఉంది.యూజర్ ఐడిని ఆధార్‌తో లింక్ చేసి, బుక్ చేసుకునే టికెట్‌లోని ప్రయాణీకుల్లో ఒకరు ఆధార్ ద్వారా వెరిఫై చేయబడాలి.

లింక్ చేయబడి, బుక్ చేయాల్సిన టిక్కెట్‌లోని ప్రయాణీకులలో ఒకరు ఆధార్ ద్వారా ధృవీకరించబడతారని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.అంటే ప్రయాణికుల్లో ఒకరై ఉండాలని నిబంధన ఉంది.

ఇది ఏ మాత్రం కష్టమేమీ కాదు.ఇక ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube