ఈ నెల 9వ తేదీన విఘ్నేష్ శివన్ నయనతారల పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే.గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు.
నయనతార విఘ్నేష్ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారని సమాచారం అందుతోంది.తాజాగా విఘ్నేష్ శివన్ నుంచి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
విఘ్నేష్ శివన్ తన ప్రేయసి అయిన నయనతారను ఈ నెల 9వ తేదీన మహాబలిపురంలో పెళ్లి చేసుకుంటున్నానని తెలిపారు.కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించామని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.
మొదట తాను, నయనతార తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని భావించామని అయితే కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గామని విఘ్నేష్ తెలిపారు.

తిరుపతిలో పెళ్లి అంటే ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయని అందువల్లే వివాహ వేదికను మార్చామని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.జూన్ 9వ తేదీన ఉదయం తనకు నయనతారకు పెళ్లి జరుగుతుందని 9వ తేదీ మధ్యాహ్నం పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తానని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు.జూన్ 11వ తేదీన తను, నయనతార ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా కలుస్తామని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.

ప్రొఫెసనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఫ్యాన్స్ ఆశీర్వాదాలు తమకు ఉండాలని కోరుకుంటున్నానని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు.నయనతార మాత్రం పెళ్లికి సంబంధించి ఎటువంటి విషయాలను వెల్లడించలేదు.సినీ ప్రముఖులలో చాలా తక్కువమందికి పెళ్లికి సంబంధించి ఆహ్వానం అందిందని తెలుస్తోంది.కెరీర్ పరంగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే నయనతార పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
సినిమాసినిమాకు నయనతారకు క్రేజ్ పెరుగుతోంది.







