మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో మృత దేహం లభ్యం విశాఖ జిల్లాలో పదో తరగతి పరీక్ష తప్పిన ఓ విద్యార్థి తల్లి మందలించిందని రిజర్వాయర్ లో దూకి ఆత్మ హత్య చేసుకున్నారు.పెందుర్తి మండలం అప్పలనరసయ్య కాలనీలో నివాసం ఉంటున్న సాయి అనే విద్యార్థి నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు.
టెన్త్ పరీక్ష ఫెయిల్ కావడంతో తల్లి మందలించిందని బాలుడు డు బయటికి వెల్లినట్టు భావించారు.అయితే అతని చెప్పులు మొబైల్ ఫోన్లు మేఘాద్రి రిజర్వాయర్ వద్ద కనిపించాయి.
దీంతో అందులో దూకేసి ఉంటాడని భావించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు .పెందుర్తి సీఐ అశోక్ క్ కొందరు ఈతగాళ్లను రప్పించి ఈ రోజు ఉదయం కూడా గాలించగా సాయి మృత దేహం లభ్యం అయ్యింది.విగత జీవిగా సాయి కనిపించడంతో అప్పల నరసయ్య కాలనీలో విషాదం నెలకొంది.