ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో.. అతనెవరంటే?

మలయాళ ఇండస్ట్రీతో పాటు తెలుగు అలాగే హిందీ సినీ ప్రేక్షకులకు మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా విభిన్నమైన కథలను పెంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటాడు.

 Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released , Prithviraj Suk-TeluguStop.com

పృథ్వి రాజ్ చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది.అయ్యప్పనుమ్​ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో వెబ్ సిరీస్​లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్​లో ఉండబోతోంది అని సమాచారం.

ఇక అందులో భాగంగానే తాజాగా తన తాజా సినిమా గోల్డ్​ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను విడుదల చేశాడు పృథ్వీరాజ్​.ఈ సినిమాలో హీరోయిన్​గా లేడీ సూపర్​ స్టార్​ నయనతార నటిస్తోంది.

ఈ పోస్టర్​లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తు ఉండగా పృథ్వీరాజ్​ సుకుమారన్ మాత్రం నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు.

Telugu Poster, Mollywood, Nayanathara-Movie

ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్టర్​ సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.ఇకపోతే ఈ సినిమాని పృథ్వీరాజ్​ ప్రొడక్షన్స్​, మ్యూజిక్​ ఫ్రేమ్స్​ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్​ స్టీఫెన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు అల్ఫోన్స్​ పుత్రెన్​ దర్శకత్వం వహిస్తున్నారు.

సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్​ డైరెక్టర్​గా తన మార్క్​ చూపించ బోతున్నారు.ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube