మమత మోహన్ దాస్ మరియు పృథ్వీరాజ్ లు కీలక పాత్రల్లో రూపొందిన మలయాళ మూవీ జనగణమన సూపర్ హిట్ అయ్యింది.ఇటీవలే థియేటర్లలో విడుదల అయిన మలయాళ వర్షన్ జనగణమన కు భారీ గా వసూళ్లు నమోదు అయ్యాయి.
దాంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లో వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది.
కేవలం మలయాళంలోనే కాకుండా అన్ని సౌత్ భాష ల్లో మరియు హిందీ లో కూడా ఆడియో తో స్ట్రీమింగ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా మొన్నటి వరకు నెట్ ఫ్లిక్స్ ఇండియా లో ఆర్ ఆర్ ఆర్ స్ట్రీమింగ్ అయ్యింది.
ఇప్పుడు జన గణ మన సినిమా రావడంతో ఈ సినిమా స్ట్రీమింగ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.దేశం లో అన్ని చోట్ల అన్ని భాష ల్లో కూడా మంచి ఆధరణ లభిస్తుంది.
అయితే తెలుగు లో మాత్రం ఈ సినిమా గురించి జనాలు అంతగా మాట్లాడుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
సోషల్ మీడియా మరియు రాజకీయ వ్యవస్థ మన సమాజం ను ఎంత దారుణంగా మార్చుతున్నాయి అనేది సినిమా కథాంశం.
చాలా అద్బుంగా దర్శకుడు మలయాళం లో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.వసూళ్ల పరంగా నెట్ ఫ్లిక్స్ లో వ్యూస్ పరంగా అక్కడ మంచి సక్సెస్ అయ్యింది.తెలుగు లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేసినా కూడా పెద్దగా జనాల నుండి ఆధరణ దక్కించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.ఎక్కువ శాతం మంది అసలు ఈ టైటిల్ కే సినిమా ఒక దేశ భక్తి సినిమా అయ్యి ఉంటుంది ఏముంది లే చూడటం అంటూ లైట్ తీసుకుంటున్నారు.
మరీ ఇలాంటి తెలుగు ప్రేక్షకులు ఏంట్రా బాబు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ప్రేక్షకులు చాలా కమర్షియల్ గా తయారు అయ్యి కమర్షియల్ సినిమా లపై మాత్రమే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
అందుకే తెలుగు లో జనగణ మన గురించి మన వారు పట్టించుకోవడం లేదు.







