వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ జంటగా తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి.నజ్రియా రాజా రాణి డబ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి తన అద్భుతమైన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే ఈమె మొట్టమొదటిసారిగా అంటే సుందరానికి సినిమా ద్వారా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఈ నెల 10వ తేదీ విడుదల కానుంది.
విడుదల తేది దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నాన్ థియేటరికల్ హక్కులను అమెజాన్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకు అమెజాన్ లో విడుదల చేయనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొనే సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఇక ఈ సినిమాలో నాని బ్రాహ్మణుడి పాత్రలో సందడి చేయగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది.మొత్తానికి ఈ సినిమా ద్వారా నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారని తెలుస్తోంది.గత ఏడాది శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న నాని అంటే సుందరానికి సినిమా ద్వారా మరొక విజయాన్ని అందుకోనున్నారని అభిమానులు సినిమాపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.







