కొత్తగా ముద్రించనున్న భారత కరెన్సీ నోట్లలో మునుపెన్నడూ చూడని వ్యక్తుల చిత్రాలు ఉండే అవకాశం ఉంది.ఇప్పటివరకు, భారతీయ నోట్లలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంది.
అయితే గాంధీతో పాటు మరికొందరు ప్రముఖుల ఫొటోలు కరెన్సీ నోట్లపై ముద్రించనున్నట్లు తెలుస్తోంది.ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొన్ని డినామినేషన్ల కొత్త సిరీస్ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం వాటర్‌మార్క్ బొమ్మలను ఉపయోగించే ఆలోచనలో ఉన్నారు.
బెంగాల్ ప్రముఖులలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రముఖ వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనతో పాటు భారతదేశపు 11వ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అని కూడా పిలువబడే ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అమెరికా కరెన్సీ నోట్ల ముద్రణ విధానాన్నే అనుసరించనున్నట్లు అర్థమవుతోంది.యూఎస్ డాలర్లపై జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫెర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్‌తో సహా కొంతమంది 19వ శతాబ్దపు అధ్యక్షుల చిత్రాలను కలిగి ఉంటాయి.
ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పిఎంసిఐఎల్) ఇటీవల కీలక చర్య చేపట్టింది.గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్‌ల నమూనాలలో రెండు వేర్వేరు సెట్లను ఐఐటి-ఢిల్లీ ఎమిరిటస్ ప్రొఫెసర్ దిలీప్ టి షాహానీకి పంపినట్లు తెలిసింది.

రెండు సెట్ల నుండి ఎంచుకుని, వాటిని ప్రభుత్వం తుది పరిశీలన కోసం సమర్పించమని సహానీకి ఆదేశాలు వెళ్లాయి.దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.2017లో కొత్త నోట్ల సిరీస్‌లకు కొత్త భద్రతా ఫీచర్లను సిఫార్సు చేసేందుకు ఆర్‌బీఐ తొమ్మిది అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసింది.అందులో ఒకటి, 2020లో తన నివేదికను సమర్పించింది.
గాంధీతో పాటు ఠాగూర్, కలాం వాటర్‌మార్క్ బొమ్మలను కూడా అభివృద్ధి చేయాలని కమిటీ ప్రతిపాదించింది.