టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఓటీటీ లో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా అందుబాటులో ఉంది.
తెలుగు సినీ ప్రేమికులు దాదాపు అందరు చూశారు.ఇలాంటి సమయంలో అమెరికాలో ఈ సినిమా ను స్ట్రీనింగ్ చేస్తే భారీ ఎత్తున జనాలు రావడం అందరిని ఆశ్చర్యపర్చింది.
ముఖ్యంగా వీకెండ్ కాకున్నా కూడా భారీ ఎత్తున జనాలు రావడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా అమెరికా లో కూడా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటు లో ఉంది.
అయినా కూడా థియేటర్ లో చూడాలని కొందరు భావించి స్క్రీనింగ్ చేయగా భారీ ఎత్తున జనాలు వచ్చారట.
ఊహించనంత మంది రావడం అందరిని ఆశ్చర్యపర్చిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను కొందరు ట్రోల్స్ చేయడం జరిగింది.వారికి ఇదే సమాధానం అంటూ యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ విడుదల అయిన పది వారాల తర్వాత విడుదల అయినా కూడా ఆధరణ ఏమాత్రం తగ్గక పోవడం చూస్తుంటే జక్కన్న సినిమా స్టామినా మరియు హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల యొక్క అద్బుతమైన స్టార్ డమ్ కు నిదర్శనం అన్నట్లుగా మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.

హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దర్శకుడు రాజమౌళి ఫ్యాన్స్ కూడా సినిమా ను చూసేందుకు క్యూ కట్టారు.అందుకే ఇప్పుడు థియేటర్ లో రీ రిలీజ్ అయినా కూడా జనాలు తగ్గడం లేదు. ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో అజయ్ దేవగన్ మరియు శ్రియ నటించారు.
ఎన్టీఆర్ కు జోడీగా ఫారిన్ బ్యూటీ ఒలివియా నటించిన విషయం తెల్సిందే.







