సుడిగాలి సుదీర్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బుల్లితెర స్టార్ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ప్రస్తుతం వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలను అందుకని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఇలాంటి స్టార్ డమ్ అనుభవిస్తూ ఉన్నారంటే అందుకు కారణం జబర్దస్త్ కార్యక్రమం అని చెప్పాలి.
ఈ కార్యక్రమం ద్వారా పరిచయమైన సుధీర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయారు.
సుడిగాలి సుదీర్ తనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల వారి నుంచి దూరం అయినట్లు తెలుస్తోంది మల్లెమాల వారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్, ఢీ,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు సుధీర్ దూరం అయ్యి స్టార్ మాకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.సుడిగాలి సుదీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు.ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్ కార్యక్రమానికి ఒక్కో ఎపిసోడ్ కి సుమారు ఆరున్నర లక్షల నుంచి 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో అందుకే సుధీర్ మల్లెమాల వారిని వదిలి స్టార్ మాకి వచ్చారని పలువురు భావిస్తున్నారు.







