వైసీపీలో ఎక్కడ తప్పు జరుగుతోంది?

ఎన్నికలు అంటే ఏ రాజకీయ పార్టీకైనా ముఖ్యమే.అధికారంలోకి రావాలంటే ప్రజలు ఆదిరించాల్సిందే.

 Where Is The Mistake Going On In Ycp Andhra Pradesh, Ysrcp, Elections, Cm Jagan,-TeluguStop.com

ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో పరాజయం తప్పదు.ఇటీవల కాలంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.

వాస్తవానికి ఆ సమయంలో ధరల ప్రభావం కారణంగా మోదీపై వ్యతిరేకత ఉంటుందని అందరూ భావించారు.కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి.

ఐదు రాష్ట్రాలలో ఏకంగా నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది.అయితే ఇలా ఎందుకు జరిగింది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

అసలు బీజేపీ గెలిచే పరిస్థితి లేదనుకున్న యూపీలోనూ ఎందుకు విజయం దక్కించుకుందంటే.ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం కాదు.

తాము అభివృద్ధి చేస్తున్నామని ప్రజలకు బీజేపీ చెప్పడమే.ఆ దిశగా కార్యాచరణను బీజేపీ చేపట్టింది.

కానీ ఏపీలో వైసీపీకి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయా అంటే కొంచెం ఆలోచించాల్సిందే.ఏపీలో అభివృద్ధి విషయాన్ని వైసీపీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారు.ఎక్కడైనా ప్రభుత్వం తమను అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా బంగారు బాటను చూపాలి.కానీ వైసీపీ ప్రభుత్వం నగదు బదిలీ చేయడంపైనే దృష్టి పెట్టింది తప్పితే భవిష్యత్ తరాల గురించి గాలికొదిలేసింది.

దీంతో యువత వైసీపీ సర్కారుపై వ్యతిరేకత చూపిస్తున్నారు.అందుకే ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

Telugu Andhra Pradesh, Bjp, Chandra Babu, Cm Jagan, Lokseh, Ysrcp-Telugu Politic

నిజానికి కరోనా నేపథ్యంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు సాగలేదు.కానీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు తాము ఏం చేస్తున్నామో ప్రజలకు వివరించాయి.అయితే వైసీపీ ప్రభుత్వ వ్యవహారం మాత్రం చెప్పుకోవడానికి ఏం లేదు అన్నట్లు తయారైంది.ఇంతవరకు ఏపీకి రాజధాని లేదంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఊహించండి.మరోవైపు పార్టీలో అసమ్మతి నేతలు ఎక్కువ అయ్యారు.వీరి వల్ల ఆ పార్టీ తీవ్ర నష్టం చేకూరుతోంది.

అదే సమయంలో ఇప్పుడున్న సిట్టింగులపై ప్రజల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.వైసీపీలో ఇన్ని తప్పులు జరుగుతున్న వేళ వాటిని సరిదిద్దుకుని జగన్ ఎలా ముందుకు సాగుతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube