సింగపూర్: అరుదైన కొండ చిలువల స్మగ్లింగ్... భారత సంతతి వ్యక్తికి జరిమానా

మలేషియా నుంచి సింగపూర్‌లోకి కొండ చిలువలను అక్రమంగా రవాణా చేసిన కేసులో భారత సంతతికి చెందిన మలేషియా ట్రక్ డ్రైవర్‌కు సింగపూర్ కోర్ట్ జరిమానా విధించింది.నిందితుడిని 51 ఏళ్ల పులేంథిరన్ పళనియప్పన్‌గా గుర్తించారు.

 Indian-origin Malaysian Fined For Smuggling Pythons Into Singapore,singapore,sin-TeluguStop.com

పర్మిట్ లేకుండా కొండ చిలువలను దిగుమతి చేసుకున్నట్లు నేరాన్ని అంగీకరించిన తర్వాత అతనికి జరిమానా విధించినట్లు ఛానల్ న్యూస్ ఏషియా నివేదించింది.కొండ చిలువలను సురక్షితమైన పద్ధతిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రవాణా చేసిన అభియోగంలోనూ నిందితుడిని శిక్షార్హుడిగా పరిగణించింది కోర్ట్.

రెటిక్యులేటెడ్ పైథాన్ అనేది దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందిన పైథాన్ జాతి.ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పాము.అనేక దేశాల్లో దీని చర్మాన్ని సాంప్రదాయ వైద్యంలో వినియోగిస్తుండటం, పెంపుడు జంతువులుగా విక్రయిస్తుండటంతో దీనిని కొందరు వేటాడుతున్నారు.పళనియప్పన్ నడుపుతున్న కంటైనర్ ట్రక్కును తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అండ్ చెక్‌పాయింట్ అథారిటీ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 7న కొండ చిలువలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ రెండు కొండ చిలువులు కోలుకోలేని ఆరోగ్య పరిస్ధితులు మధ్య వున్నట్లు గుర్తించారు.

Telugu Singapore-Telugu NRI

డ్రైవర్ సీటుపైన వున్న ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో దాచిన స్టైరోఫోమ్ బాక్స్‌లోని గుడ్డలో రెండు కొండ చిలువలను ఉంచినట్లు అధికారులు గుర్తించారు.సింగపూర్‌లోని ఒక కంపెనీకి సిమెంట్‌ను డెలివరీ చేయాలని చెబుతూ.జోహార్ బహ్రూలో కొండ చిలువలు వున్న పెట్టెను నిందితుడు తీసుకొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసుకు సంబంధించి నిందితుడి తరపు న్యాయవాది ధిల్లాన్ సురీందర్ సింగ్ 3,500 సింగపూర్ డాలర్ల జరిమానా విధించాలని కోరారు.పళనియప్పన్ బాక్స్‌ను తెరిచిచూడకపోవడం వల్ల కొండ చిలువల ఆరోగ్య పరిస్ధితి ఎలా వుందో తెలియలేదని ధిల్లాన్ కోర్టు దృష్టి తీసుకెళ్లారు.

అయితే ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.పళనియప్పన్‌కు 5,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు.ఇకపోతే.పర్మిట్ లేకుండా నిషేధిత జాబితాలోని కొండ చిలువలను దిగుమతి చేసుకున్నందుకు రెండేళ్ల జైలు శిక్ష, 50,000 సింగపూర్ డాలర్ల జరిమానా లేదా రెండు విధించే అవకాశం వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube