ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే కాంబో లో పాన్ రాబోతున్న విషయం విదితమే.
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా కూడా విజయ్ తోనే చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.లైగర్ విషయంలో కరోనా కారణంగా ఆలస్యం అవ్వడంతో ఈ సినిమా మాత్రం రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.

ప్రెసెంట్ చిత్ర యూనిట్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుంది.పక్కా ప్లాన్ తో యాక్షన్ సన్నివేశాలను తెరక్కించడంలో పూరీ బిజీగా ఉన్నాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఈ వారంలో జాయిన్ అవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో పూజా ను హీరోయిన్ గా తీసుకున్న విషయం విదితమే.
ఈ క్రమంలోనే ఈ అమ్మడిపై కూడా యాక్షన్ సీక్వెన్స్ ను పూరీ ప్లాన్ చేసాడట.ఇప్పటికే ఈమె ఇందుకోసం విదేశీ కోచ్ దగ్గర ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు టాక్.
ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.







