బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి అయ్యింది.
ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని కొందరి పేర్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ సీజన్ లో ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులను అలాగే జబర్దస్త్ కంటెస్టెంట్ లను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం.తాజాగా జబర్దస్త్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వర్ష పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్ష ఇదివరకే సీజన్ ఫైవ్, నాన్ స్టాప్ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొన లేకపోయిందని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సీజన్ 6 లో కూడా తనకు అవకాశం వచ్చిందని, ఈసారి మాత్రం పక్కాగా ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.అయితే ప్రస్తుతం వర్ష జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాలలోను అలాగే పలు సీరియల్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తారా?లేదా?అసలు తన గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.







