ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగారనే సంగతి తెలిసిందే.కొన్ని సన్నివేశాల్లో తారక్ తన స్థాయిని తగ్గించుకుని మరీ అద్భుతంగా నటించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలో చరణ్, ఎన్టీఆర్ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.తాజాగా ఆర్మాక్స్ మీడియా 2022 సంవత్సరం ఏప్రిల్ వరకు పాన్ ఇండియా స్టార్స్ పై అధ్యయనం చేయగా ఈ జాబితాలో తొలి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలిస్తే రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.మరో స్టార్ హీరో బన్నీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.బాలీవుడ్ నుంచి ఈ జాబితాలో అక్షయ్ కుమార్ మినహా మరే బాలీవుడ్ స్టార్ కు చోటు దక్కకపోవడంతో ఇతర హీరోల అభిమానులు తెగ ఫీలవుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో ఉన్నారు.

కేజీఎఫ్2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న యశ్ ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు.ఆర్ఆర్ఆర్ తో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్ హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం.దేశంలోనే పాన్ ఇండియా హీరోల జాబితాలో ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.రాబోయే రోజుల్లో తారక్ కచ్చితంగా తొలి స్థానంలో నిలుస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







