చిరుపై కోట కామెంట్ల గురించి స్పందించిన బాబుమోహన్.. మంచోడు అంటూ?

కొన్నిరోజుల క్రితం మెగా హీరోల గురించి కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్ల గురించి నెట్టింట జోరుగా చర్చ జరిగింది.కోట శ్రీనివాసరావు మనస్సులో ఏదో పెట్టుకుని ఈ తరహా కామెంట్లు చేశారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 Babu Mohan Reaction About Kota Megastar Chiranjeevi Controversy Comments Goes Vi-TeluguStop.com

కోట శ్రీనివాసరావు సన్నిహితులలో ఒకరైన బాబు మోహన్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన గురించి, ఆయన చేసిన కామెంట్ల గురించి స్పందించారు.

ప్రస్తుతం తాను ఐదారు సినిమాలు చేస్తున్నానని ఆ ఒక్కటి అడక్కు టీవీ సీరియల్ లో తాను తాత రోల్ లో చేస్తున్ననని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

కొత్త తరాలు వచ్చే కొద్దీ సినిమా ఇండస్ట్రీలో మార్పులు వస్తూ ఉంటాయని బాబు మోహన్ పేర్కొన్నారు.ఒక్కొక్క తరానికి ఒక్కో విధంగా వేరియేషన్స్ ఉంటాయని ఆయన తెలిపారు.

తనకు పాత్ర నచ్చితేనే తాను సినిమాలలో చేస్తానని ఆయన వెల్లడించడం గమనార్హం.

తాను కోట శ్రీనివాసరావు అన్నాదమ్ములలా ఉంటామని బాబు మోహన్ తెలిపారు.

Telugu Aaokkati, Babu Mohan, Babu Mohan Kota, Chiranjeevi, Heroes, Tollywood-Mov

కోట శ్రీనివాసరావు అక్కలు, తమ్ముళ్లు బాబు మోహన్ ఓన్ బ్రదర్ అని చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు.సూట్ వేసుకుంటే నటుడు కాదని ఏ పాత్ర అయినా చేయాలని బాబు మోహన్ అన్నారు.తాను పాత్రకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన కామెంట్లు చేశారు. కోట శ్రీనివాసరావు మెగా హీరోలపై చేసిన కామెంట్లు ఆయన వ్యక్తిగత విషయాలని బాబు మోహన్ తెలిపారు.

Telugu Aaokkati, Babu Mohan, Babu Mohan Kota, Chiranjeevi, Heroes, Tollywood-Mov

కోట శ్రీనివాసరావు నాతో బాగుంటాడని మేము అన్నాదమ్ముళ్లమని పక్కపక్క ఇళ్లలోనే ఉంటామని ఆయన అన్నారు.నాకు కోట శ్రీనివాసరావు మంచోడు అని ఆయన చెప్పుకొచ్చారు.నాకు ఆయన ఆత్మీయుడు అని తాను కూడా ముక్కుసూటిగా ఉంటానని ఆయన అన్నారు.తాను నిప్పులా ఉన్నానని అబద్ధం ఆడలేదని లంచం తీసుకోలేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube