రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి ఫైర్ ! దుర్మార్గుడు అంటూ...?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో నోటికి పని చెప్పారు.రేవంత్ రెడ్డి దొంగ అని,  బ్లాక్ మెయిలర్ అని మల్లారెడ్డి విరుచుకుపడ్డారు.

 Mallareddy Sensitional Comments On Revanth Reddy , Revanth Reddy, Telangana, Con-TeluguStop.com

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనను ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేసే వాడని ఆఖరుకు తాను ఇచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేశాడని,  ఆ విషయం కాదు అని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు.అసలు కెసిఆర్ కేటీఆర్ ల ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉందని మల్లారెడ్డి ప్రశ్నించారు.

రైతు రచ్చబండ తో పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జనాల్లో తిరుగుతున్నారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన కెసిఆర్,  కెటిఆర్ పైన విమర్శలు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి కేసిఆర్ కేటీఆర్ న టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిగతంగానూ విమర్శలు చేస్తుండడంతో మల్లారెడ్డి ఈ విధంగా స్పందించారు.రేవంత్ రెడ్డి తన విమర్శల్లో మల్లారెడ్డి పేరును సైతం ప్రస్తావించడం , మల్లారెడ్డి ఆయన అల్లుడు భూ కబ్జాదారులు అని ఆరోపణలు చేసిన క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్లారెడ్డి ఈ స్థాయిలో స్పందించారు.

రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని , ఆయన నిర్వహించేది రచ్చబండ కాదు .భట్టేబజ్  బండ అని విమర్శించారు.  కోట్లాది రూపాయలు లంచం ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.  రేవంత్ రెడ్డి ది ఐరన్ లెగ్ అని…  ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందంటూ మల్లారెడ్డి శాపనార్ధాలు పెట్టారు.

తాను కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పిన మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అన్నారు.  తాను టిడిపిలో ఉన్న సమయంలో మల్కాజ్ గిరి సీటు తనకు రాకుండా అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని… చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పి ఎంపీ సీటు తెచ్చుకుని గెలిచానని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube