ఊరి పేర్ల చివర పురం అని అందుకే ఉంటుందట!

మనదేశంలోని పలు నగరాల పేర్ల చివర పురం (పూర్) అని ఉండటాన్ని మీరు చూసే ఉంటారు.కాన్పూర్, నాగ్‌పూర్, జబల్‌పూర్, జైపూర్, జోధ్‌పూర్, రాంపూర్, ఉదయపూర్, గోరఖ్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, షోలాపూర్, ఫతేపూర్, జౌన్‌పూర్ ఇలా.

 Pur Word Used In Indian Cities Name And What Is Meaning , Raja Jaisingh Jaipur ,-TeluguStop.com

పలు నగరాల పేర్లలో పూర్ అనే పదం కనిపిస్తుంది.అయితే ఊరి పేర్ల చివర పూర్ అని ఎందుకు ఉంటుంది?. పూర్ అంటే అర్థం ఏమిటని అని మీరు ఏరోజైనా ఆలోచించారా? దీని అర్థం తెలుసుకుంటేనే ఇలా ఎందుకు ఉందో మీకు అవగతమవుతుంది.ప్రతి నగరానికి లేదా పట్టణానికి దాని పేరు వెనుక ఏదో ఒక ఆసక్తికర కథనం ఉంటుంది.

అంటే ఆ ఊరు పేరుకు ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది.తరువాత దానికి పూర్ అని జత చేరుస్తారు.రాజస్థాన్‌లో రాజా జైసింగ్ జైపూర్‌ని స్థాపించిన కారణంగా అతని పేరు జై వచ్చి, ఆ తర్వాత పూర్ చేరి, అది చివరికి జైపూర్‌గా మారింది.పూర్ అనే పదాన్ని చాలా కాలంగా వివిధ ప్రాంతాలు, స్థలాల పేర్ల కోసం వాడుతున్నారు.

మహాభారతంలో కనిపించే హస్తినాపురంలో కూడా దీనిని గమనించవచ్చు.పూర్ అనే పదం ఎలా వచ్చిందనే దానిపై నిపుణులు తమ అభిప్రాయం తెలిపారు.

దాని ప్రకారం పూర్ అంటే నగరం లేదా కోట అని అర్థం.దీని ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది.

ఒక నిర్దిష్టమైన పేరు తర్వాత పూర్ అని చేరిస్తే, ఆ నగరానికి పేరు ఏర్పడుతుంది.కొందరు నిపుణులు దీని గురించి మాట్లాడుతూ పూర్ అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చిందని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లోని అనేక ప్రాంతాలలో కూడా పూర్ అనే పదం కనిపిస్తుందని వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube