మనం ఎంత ఎత్తు ఎదుగుతున్నాం.ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాను అన్నది ముఖ్యం కాదు.
మనం మన పిల్లలకు ఎంత సంస్కారం నేర్పిస్తున్నాం అనేది ముఖ్యం అన్న విషయాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే చాలామంది పిల్లలు చిన్న వయస్సు నుంచే సంస్కారం తోపాటు కొన్నిరకాల విలువల్ని నేర్చుకుంటూ ఉంటారు.
కొందరు తల్లిదండ్రులు అయితే వారి పిల్లల్ని అతి గారాబం చేయడం వల్ల ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే నైతిక విలువలను నేర్చుకోవడం సంగతి పక్కన పెడితే ఆ పిల్లలు చెడి పోవడానికి ముఖ్యకారణం తల్లిదండ్రులే అవుతారు. తల్లిదండ్రులు గారాబం పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది.
తల్లిదండ్రులు గారాబం చేయడం వల్ల మొండిగా, మాట వినకుండా తయారు చేస్తుంది.
ఈ మధ్య కాలంలో అయితే చాలామంది తల్లిదండ్రులు గారాబం వల్ల పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం తో పాటుగా,అల్లరిగా తిరుగుతూ కనీసం కుటుంబానికి సంబంధించిన విషయాలను అడిగిన కూడా చెప్పలేని పరిస్థితులలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు.
కొందరు తల్లిదండ్రులు పెద్దలు వారికి ఉన్న కులం పిచ్చిని పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు.ఇకపోతే అసలు విషయంలోకి వెళితే తాజాగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అయిన అల్లు అర్హ పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కూతురుని నీ పేరు ఏమిటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా.

అల్లు అర్హ రెడ్డి అని సమాధానం ఇచ్చింది.అల్లు అర్హ రెడ్డి చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అవుతున్నారు.అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకోగా వారికి అయాన్,అర్హ అనే ఇద్దరు పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.అల్లు అర్హ తన పేరుని అల్లు అర్హ రెడ్డిగా చెప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇదే విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, స్నేహా రెడ్డి సామాజిక వర్గం చెందిన ఆమె అని అందరికి తెలిసిందే.
సాధారణంగా అయితే పిల్లలు తండ్రి ఇంటి పేరుతో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఉంటారు.కాని ఇక్కడ అర్హ వ్యవహారం ఇప్పుడు అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విషయంపై అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.







