సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరిర్ ప్రారంభించిన సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ షో కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
అలా జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ని బయట పెడుతూ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సుదీర్.అలా అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెర పై కూడా సినిమాల్లో హీరోగా నటిస్తు అవకాశాలను కూడా దక్కించుకున్నాడు సుధీర్.
ఈ విధంగా లక్షలకొద్దీ అభిమానులను దక్కించుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.
జబర్దస్త్,ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పోవే పోరా పలురకాల ఈవెంట్ల ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు.ఇకపోతే సుధీర్ ఏఏ షోకి ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతమంది జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళిన కూడా సుడిగాలి సుధీర్ మాత్రం జబర్దస్త్ షోని వదలడం లేదు.అయితే అందుకు గల కారణం అందరికంటే సుధీర్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.
అలా ఒక్కో ఎపిసోడ్‌కు సుధీర్ టీమ్‌కు జబర్ధస్త్ వాళ్లు 5 లక్షలు ఇస్తున్నారట.

అలా ఒక నెలకు సుధీర్ రూ.5 నుంచి 6 లక్షల వరకూ రాబడుతున్నాడు.ఢీ షోకు గానూ అతడు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 1.50 లక్షలు తీసుకుంటున్నాడట.అలాగే, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక్కో ఎపిసోడ్‌కు 80 వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ రెండు షోలు ద్వారా నెలకు 10 లక్షలు వరకు సంపాదిస్తునట్లు తెలుస్తోంది.అలా మొత్తానికి సుధీర్ నెలకు షోల ద్వారానే దాదాపుగా 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.ఇక హీరోగా చేసే సినిమాలకు మాత్రం ఏకంగా 30 నుంచి 40 లక్షలు వెనకేస్తున్నాడని సమాచారం.
ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అతడు ఇప్పుడు ఏకంగా రెండు మూడు చిత్రాల్లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.