మే 20వ తారీకు ఏంటీ అంటే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటూ గట్టిగా అరిచినంత పని చేస్తారు.ఎన్టీఆర్ కు ఉన్న స్టార్ డమ్ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో నేడు చేసే సందడి అంతా ఇంతా కాదు.
వారు అంతా కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం గత రెండు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు.ఇదే సమయంలో ఎన్టీఆర్ తో పాటు ఆయన స్నేహితుడు అయిన మంచు మనోజ్ జన్మించాడు.
మంచు మనోజ్ బర్త్ డే కూడా నేడు.కాకతాళీయమో లేదా మరేంటో కాని ఎన్టీఆర్ మరియు మనోజ్ లు ఒకే రోజు పుట్టారు.
ఒకే సారి పెళ్లి చేసుకున్నారు.ఇద్దరు కూడా ఇండస్ట్రీలో కాస్త అటు ఇటుగా ఒకేసారి వచ్చారు.
ఇద్దరు కూడా మంచి స్నేహితులు.కాని ఇద్దరికి ఇమేజ్ లో.స్టార్‌డ మ్ లో ఉన్న తేడా చాలా ఎక్కువ.అయినా కూడా మంచు మనోజ్ ను తనకు అత్యంత ఆప్తుడిగానే ఎన్టీఆర్ పేర్కొంటూ ఉంటాడు.
నేడు ఇద్దరు కూడా కలవడం పార్టీ చేసుకోవడం చేస్తూ ఉంటారట.
ఎన్టీఆర్ కు సన్నిహితుడు అయినా కూడా మంచు మనోజ్ ను నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఏ ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఆయన పీఆర్ టీమ్ ఒకరు ఇద్దరు మీడియా జర్నలిస్ట్ లు తప్ప ఎవరు కూడా సోషల్ మీడియాలో కాని ఇతర చోట కాని సందడి చేస్తున్న దాఖాలాలు లేవు.ప్రస్తుతం ఆయన సినిమాలు ఏమీ చేయడం లేదు.
కనుక జనాలు ఆయన్ను దాదాపుగా మర్చి పోయారు అంటున్నారు.ఆయన అహం బ్రహ్మస్మి అంటూ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
అయినా కూడా జనాలు ఆయన గురించి మాట్లాడుకోవడం లేదు. మా తరపున మీ తరపున ఎన్టీఆర్ తో పాటు మంచు మనోజ్ కు కూడా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు
.






