గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై క్యాష్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సుమ ఎంటర్టైన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే క్యాష్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మేజర్ చిత్రబృందం సుమ క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హీరో అడివి శేష్, గీత భగత్, శ్రీ చరణ్ పాకాల, డైరెక్టర్ శశికిరణ్ తిక్క హాజరయ్యారు.
ఇక ఎప్పటిలాగే సుమ వీరందరితో తనదైన శైలిలో ఆటపాటలతో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వీరికి పలు టాస్క్ లను నిర్వహించి ప్రేక్షకులను సందడి చేశారు.ఇకపోతే ఈ ప్రోమోలో హీరో అడివి శేష్ సుమ పై పంచులు వర్షం కురిపించారు.ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ చిన్నప్పటినుంచి టీవీలో యాంకర్ గా పని చేయడం చూస్తున్నాను అంటూ పరోక్షంగా సుమ వయసు గురించి మాట్లాడుతూ వేదికపై ఆమె పరువు తీశారు.
ఈ విధంగా సుమ మేజర్ చిత్ర బృందంతో కలిసి ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాలి.







