కెనడా : విహారయాత్రలో విషాదం.. పార్క్‌లో నీటమునిగి భారతీయ విద్యార్ధి మృతి

స్నేహితులతో సరదాగా గడుపుదామని పార్క్‌కి వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.కెనడాలో ప్రమాదవశాత్తూ నీటమునిగి పంజాబ్‌కు చెందిన భారతీయ విద్యార్ధి మృతి చెందాడు.

 Punjab Youth Dies In Ontario Province Of Canada Punjab , Canada ,punjab Youth-TeluguStop.com

యువకుడిని పంజాబ్‌ రాష్ట్రం మోగా జిల్లాలోని నిహల్‌సింగ్ వాలా సబ్ డివిజన్‌లోని బధ్నీ కలాన్ గ్రామానికి చెందిన నవకిరణ్ సింగ్‌గా గుర్తించారు.ఇతను ఉన్నత విద్య కోసం గతేడాది కెనడాకు వెళ్లాడు.

ఈ క్రమంలో అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లో వున్న ఎల్డోరాడో పార్క్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు కిరణ్.అయితే అక్కడ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

అతని మరణవార్తను స్నేహితులు భారత్‌లోని తల్లిదండ్రులకు తెలియజేశారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా కిరణ్ మృతదేహాన్ని భారతదేశానికి రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా వారు పంజాబ్, భారత ప్రభుత్వాలను కోరుతున్నారు.

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోనూ ఓ భారతీయ విద్యార్ధి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడు.కేరళకు చెందిన క్లింటెన్ అజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.ఈ క్రమంలో ఏప్రిల్ 26న తరగతులు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్నాడు అజిత్.

అయితే ఈ సమయంలో బాల్ .అక్కడికి దగ్గరలో వున్న చెరువులో పడింది.దానిని తీసుకొచ్చేందుకు అజిత్ చెరువులో దిగాడు.ఈ సమయంలో ఒక్కసారిగా కాలు జారీ నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు.దీనిని గమనించిన అతని మిత్రులు చెరువు దగ్గరకు వెళ్లి సాయం కోసం అరిచారు.కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అజిత్ నీటిలో గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు.దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విద్యార్ధి మృతదేహాన్ని బయటకు తీశారు.

అజిత్ మరణవార్తను స్నేహితులు కేరళలోని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube