కరాటే కళ్యాణిపై ఫైర్ అయిన శ్వేతారెడ్డి.. నీకు డబ్బులు తీసుకోవడం అలవాటు అంటూ?

నిన్నటినుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన కరాటే కళ్యాణి తాను ఎక్కడికీ పారిపోలేదని క్లారిటీ ఇవ్వడంతో పాటు తాను ఎవరినీ దత్తత తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

 Bjp Swetha Reddy Fire On Karate Kalyani Details Here Goes Viral , Karate Kalayan-TeluguStop.com

నేను పిల్లల్ని అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు.తాను ఎమోషన్ ను ఆపుకోవాలనే ఆలోచనతో గట్టిగా మాట్లాడతానని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

తాను ఏ తప్పు చేయలేదని కరాటే కళ్యాణి మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేశారు.అయితే బీజేపీ మహిళా నేత శ్వేతారెడ్డి కరాటే కళ్యాణిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఏ ఇష్యూ జరిగినా కరాటే కళ్యాణి టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొని కామెంట్లు చేస్తారని శ్వేతారెడ్డి అన్నారు.కరాటే వచ్చని ఇష్టానుసారం ప్రవర్తించడం కరెక్ట్ కాదని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.

కర్మ ఏదో ఒకరోజు తిరిగితిరిగి మన దగ్గరకు వస్తుందని శ్వేతారెడ్డి కామెంట్లు చేశారు.

శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత నేను, గాయత్రి గుప్తా బిగ్ బాస్ షోపై విమర్శలు చేశామని శ్వేతారెడ్డి తెలిపారు.

బిగ్ బాస్ షో గురించి పిటిషన్ వేయగా ఆ పిటిషన్ నడుస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.అయితే కరాటే కళ్యాణి బిగ్ బాస్ షో గొప్ప షో అని చెప్పి ఆ షోలో పాల్గొన్నారని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని కరాటే కళ్యాణి ప్రచారం చేసుకుంటారని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.

Telugu Karate Kalyani, Prank, Srikanth Reddy, Swetha Reddy-Movie

నేను డబ్బుల కోసం బిగ్ బాస్ పై ఫిర్యాదులు చేశానని కరాటే కళ్యాణి అన్నారని శ్వేతారెడ్డి కామెంట్లు చేశారు.ప్రపంచం మొత్తం ప్రాంక్ వీడియోలు చేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపారు.హిందూ ధర్మం బిగ్ బాస్ షోకు వెళ్లాలని చెప్పిందా? అని ఆమె ప్రశ్నించారు.కరాటే కళ్యాణికి డబ్బులు తీసుకోవడం అలవాటు కాబట్టి అందరూ డబ్బులు తీసుకుంటారా? అని శ్వేతారెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube