అఖిల్ ఏజెంట్ అసలేం జరుగుతుంది..!

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

 Akhil Agent What Is Running , Agent Movie, Ak Entertainments, Akhil, Akhil Agent-TeluguStop.com

సినిమా మొదలైన దగ్గర నుండి ఏదో ఒక విషయంలో అఖిల్ ఏజెంట్ చర్చల్లో ఉంటుంది.లేటెస్ట్ గా సినిమాలో కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారని టాక్.

ఏజెంట్ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలు యూరప్ లో షూట్ చేశారు.అయితే అవి చూసుకున్న మేకర్స్ ఆ సీన్స్ మళ్లీ రీ షూట్ చేయాలని అనుకుంటున్నారట.

అనుకున్నంత బాగా ఆ సన్నివేశాలు రాలేదని అందుకే మళ్లీ ఆ సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తునారట.

ఆల్రెడీ చేసిన సీన్స్ రీ షూట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా.అదే అసంతృప్తి చిత్రయూనిట్ లో కనిపిస్తుందని తెలుస్తుంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ ఖాతా తెరచిన అఖిల్ ఏజెంట్ తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వేద్య హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ మొత్తం మార్చేశాడు.

బ్యాచిలర్ లో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఏజెంట్ కోసం కండలుతిరిగిన దేహంతో మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో మళయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube