రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ఆలస్యంగా థియేటర్లలో విడుదలైనా ప్రేక్షకులు ఏ మాత్రం ఫీల్ కారనే సంగతి తెలిసిందే.రాజమౌళి మూడు, నాలుగేళ్ల పాటు సినిమాను తెరకెక్కించినా ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కేలానే సినిమా ఉంటుంది.
రాజమౌళితో సినిమాలను నిర్మించిన ఏ నిర్మాత కూడా దాదాపుగా నష్టపోలేదని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల నిర్మాతలకు 150 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చినట్టు సమాచారం.
థియేట్రికల్ కలెక్షన్ల ద్వారానే నిర్మాతలకు ఈ మొత్తం లాభంగా దక్కినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చిందని ప్రచారం జరిగింది.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో లాభాలను అందించిన సినిమా మాత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమే అని చెప్పాలి.మరోవైపు ఈ సినిమా షిప్ట్ ల వారీగా 50 రోజుల పాటు 500 కేంద్రాలలో ప్రదర్శితం అయిందని సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో ఇన్ని కేంద్రాలలో 50 రోజుల పాటు ప్రదర్శించబడిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా విజయవంతంగా ప్రదర్శించబడటం వల్లే ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సక్సెస్ అటు చరణ్ కెరీర్ కు ఇటు ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది.
ఆర్ఆర్ఆర్ మూవీ రన్ థియేటర్లలో దాదాపుగా ముగిసినట్లేనని చెప్పవచ్చు.
మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ లలో ఒకటైన జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.అధిక టికెట్ రేట్ల వల్ల థియేటర్లలో ఒక్కసారి మాత్రమే చూసిన ప్రేక్షకులు ఓటీటీలో ఎక్కువసార్లు ఈ సినిమాను చూడవచ్చని భావిస్తుండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ హిందీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.